Thursday, 30 July 2026 10:24:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఐ అద్వర్యం లో తాళ్లగొమురు సబ్స్టేషన్ ఎదుట ధర్నా...

Date : 08 February 2023 01:53 AM Views : 631

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీ లోని తాళ్లగొము రు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు a c d అదనపు ఛార్జీల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు అని అన్నారు. వెంటనే దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. దానివల్ల వేసంగి పంట వేసిన రైతులు మిర్చి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కావున రైతులకు 24 గంటలు త్రీఫేస్ ఉచిత కరెంటు వెంటనే సప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బూర్గంపాడు మండలంలో చాలాచోట్ల విద్యుత్ స్తంభాల కొరత ఉంది. కనుక డెవలప్మెంట్ చార్జీల పేరుతో వసూలు చేసిన డబ్బులతో వెంటనే ఆ విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేసి సత్వరమే ఆ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో పలు గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉంది. కనుక వచ్చేది వేసవికాలం కావున సత్వరమే పరిష్కారం చెయ్యాలని కోరారు. అలాగే కరెంటు రీడింగులు కూడా సకాలంలో తీయాలని డిమాండ్ చేశారు. సకాలంలో కరెంటు రీడింగ్ తీయకపోవడం వల్ల ఎక్కువ యూనిట్ స్లాబ్ పడి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందని చెప్పారు. కావున సకాలంలో కరెంట్ రీడింగ్ తీయాలని తెలియజేశారు. గతంలో మాదిరి దరఖాస్తు పెట్టుకున్న నిరుపేదలకు 125 రూపాయలకే కరెంటు మీటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు అలవాల సీతారాంరెడ్డి, పేరాల శ్రీనివాసరావు, మండల సహాయ కార్యదర్శి లు సిద్ధారపు సుబ్బారెడ్డి, పాండవుల బిక్షం ఏఐటిసి అధ్యక్షులు ఎండి సాజిద్, వంకాయలపాటినాగేశ్వరావు,బీమా, పేరo. వెంకటేశ్వర్ రెడ్డి,ప్రజానాట్యమండలి కాటూరి రాము, కోటమర్తి శ్రీనివాస్ ఎస్కే జలీల్ సాదా లక్ష్మీనారాయణ ఎస్ కే ఇబ్రహీం,తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :