సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీని ఒకే విడత లో వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు .బిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగానికి కొత్తగా రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2018లో రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ రుణమాఫీని 4 వార్షిక విడతల్లో మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. 2014 ఏప్రిల్ ఒకటి నుండి 2018 డిసెంబర్ 11 మధ్య రుణం పొందిన వారికి రూ.21,557 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. మొదటి విడత 25 వేల లోపు రుణం5.83 లక్షల మంది రైతులకు1,198 కోట్లు ఇచ్చి ఒకే విడత రుణమాఫీ చేయడంతో పాటు మిగిలిన రుణం నాలుగో విడతలు మాఫీ చేయబోతున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. 50 వేల లోపు రుణాలు ప్రభుత్వ నిధులు జమ చేసిందని 2018 -19 నుండి 2023- 24 వరకు బడ్జెట్ లో గాని రివైజ్డ్ చేసిన బడ్జెట్ తో సహా రూ.16,261 ఓట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం చెప్పిన ఐదవ విడత రెండువేల 23 -24 తో ముగిసిపోతుందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఉన్న రైతుల రుణమాఫీ బాకీ కి ఒకే విడత గా ప్రభుత్వం విడుదల చేసి రైతులను రుణముక్తిని చేయాలని కోరారు. ప్రస్తుతం బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. వారి రుణాలను తిరగరాసి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. రైతులు వారి అంచనా ప్రకారం 20వేల కోట్ల అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తెచ్చి వ్యవసాయలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మాఫీలో మొత్తం 40.66 లక్షల మంది రైతులు రూ.21,557 ఓట్లు వాకి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రభుత్వం గుర్తించిన మేరకు రైతుల రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వ్యవసాయం కోసం నగలు తాకట్టు పెట్టిన వారికి కూడా లక్ష లోపు మాఫీ చేస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొందని దాన్ని అమలు చేయాలని కోరారు. వానాకాలం పంట సాగు చేస్తున్న వారికి రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin