Friday, 08 May 2026 11:29:50 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

సికింద్రాబాద్-విశాఖపట్నం తొలి వందేభారత్ ట్రైన్...

Date : 11 January 2023 11:21 AM Views : 280

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఇక ఇదే తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ ట్రైన్. ఈ రైలు గంటకు 180కి.మీ వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుందని రైల్వేశాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. దీని బట్టి చూస్తే ఇప్పటిదాకా పై రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది. ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి. మరోవైపు ఈ ట్రైన్ వారంలో అన్ని రోజులు నడవనుంది. ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. 20 నిమిషాల బ్రేక్‌తో తిరిగి విశాఖకు బయల్దేరి.. రాత్రికి చేరుకుంటుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లు అయిన విజయవాడలో 5 నిమిషాలు.. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లలో రెండేసి నిమిషాల చొప్పున అగనుంది. ఇక వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రాధమికంగా నిర్ణయించిన టైమింగ్స్ ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో ఈ ట్రైన్ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్ మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌లో 2.45 గంటలకు బయల్దేరి.. విశాఖపట్నంకు తిరిగి రాత్రి 11.25 గంటలకు చేరుకుంటుంది. ఇక ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉండే ఈ రైలులో ఏసీ చైర్ కార్ ధర రూ. 1800, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3300 వరకు ఉండొచ్చునని అంచనా. కాగా, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్, టికెట్ ధరలు, ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందన్న విషయంపై ఇంకా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :