సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కరెంటు కూతలకు కేరాఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే నని, కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టకాలం కొని తెచ్చుకున్నట్టేనని టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గం కోందుర్గ్ మండలంలోని వీరన్న పేట, పెద్ద ఎలికిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజలనుదేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ హయంలో ఆయా గ్రామంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రూ.1.50 కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 535 మందికి 12.1లక్షల రూపాయలు వస్తున్నాయన్నారు. రైతు బంధు లబ్ధిదారులు 1779 మంది, 13.87కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 594 మంది, 2.56 కోట్లు, రైతు భీమా లబ్ధిదారులు 25 మంది, 1.25కోట్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 216 మంది,197లక్షలు, స్మశానవాటిక నిర్మాణం కోసం 25 లక్షలు, చౌదరిగూడ నుండి వీరన్నపేట 3.45 కోట్లతో రోడ్డు, చేగిరెడ్డి ఘనపూర్ నుండి గాలిగూడ వయా వీరన్నపేట 1కోటి, గాలిగూడ నుండి చెగిరెడ్డి ఘనపూర్ వయా పెద్ద ఎలికి చెర్ల రోడ్ 1కోటి, పెద్ద ఎలికిచెర్ల నుండి ముజాహిద్ పూర్ బిటి రోడ్ 3.85కొట్లు, 1.59 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 2 ట్యాంకుల నిర్మాణంతో 1263 ఇండ్లకు త్రాగునీటి సరఫరా.., మిషన్ కాకతీయ ద్వారా 25.70 లక్షలతో అన్నారెడ్డి చెరువు, 38.25 లక్షలతో పెద్ద చెరువుల పూడిక తీత, రైతు వేదిక కోసం 22 లక్షలు, పెద్ద ఎలికిచెర్ల గ్రామంలో డ్వాక్రా భవనం 5 లక్షలు, వీరన్నపేట గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, వీరన్నపేట గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హల్ 9 లక్షలు, వీరన్నపేట గ్రామంలో బెస్త కమ్యూనిటీ హల్ 10 లక్షలు, పెద్ద ఎలికిచెర్ల గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హల్ 5లక్షలు నిధులను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ కు మూడోసారి అవకాశం ఇవ్వాలని కారు గుర్తుకు ఓటు వేసి మరింత అభివృద్ధి పథంలో గ్రామాలు ముందుకు పోయేందుకు సహకరించాలని కోరారు.
-----------------------
Admin