సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వినాయకుని ఆశీస్సులు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వి రంగా కిరణ్ అన్నారు వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెం విద్యానగర్ కాలనీ వద్ద ఉచిత గణేష్ మట్టి విగ్రహాలను కె.వి రంగా కిరణ్. పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే రంగుల విగ్రహాలు వాడకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఆర్కే చారిటబుల్ సర్వీస్ సొసైటీ ద్వారా పాల్వంచ రైతు బజార్, దమ్మపేట సెంటర్, కొత్తగూడెంలో మెయిన్ హాస్పిటల్, విద్యానగర్ కాలనీ ఏరియాలో నియోజకవర్గ మొత్తం 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేసినట్లు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరావు గౌడ్, బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, ఓ బి సి మోర్చా జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin