సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మహాత్మా గాంధీ154వ జన్మదిన వేడుకలను పదో వార్డులో ఘనంగా నిర్వహించారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియాలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రతి వ్యక్తి నిబద్ధతతో కూడిన విధి నిర్వహనే నిజమైన ప్రజాసేవ అని ఆమె పేర్కొన్నారు. అప్పుడే గాంధీజీ కలలుగన్న ప్రజాస్వామ్యాన్ని ఏర్పర్చుకోవచ్చని ఆమె అన్నారు. నేటి సమాజంలో మహాత్ముడిలా ప్రాణాన్ని త్యాగం చేయకపోయినా కనీసం ఆయన ఆశయాలను భావితరాలకు నేర్పడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ,మేడిపల్లి సుధాకర్, ఆర్ పి కవిత, మహిళా నాయకురాలు ముద్దం మంగమ్మ, దేవాపుత్ర రాజమణి, షాహిన్, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin