సర్కార్ టీవీ న్యూస్ / విజయనగరం జిల్లా : అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు. ఘటన స్థలంలో పరిస్థితిపై ఆరా తీసినట్లు పీఎంవో వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఈ దుర్ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్లు కేంద్రమంత్రి ఓ మీడియాకు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....
-----------------------
Admin