సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల గ్రామానికి చెందిన అరుముల్ల గణేష్ చిన్ననాటి నుంచి తల్లిదండ్రులను కోల్పోయి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ కష్టాలను తట్టుకొని ఎలాంటి శిక్షణ లేకుండానే ఎంబిబిఎస్ సీటు సాధించడం గర్వకారణమని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రశంసించారు ఈ సందర్భంగా గణేష్ ఎమ్మెల్యే హనుమకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా ఎమ్మెల్యే నాగరాజు ఆయనను శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే వైద్య విద్యకు అవసరమైన పరికరాలను అందజేస్తూ ప్రస్తుతం మరియు భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు అంతేకాక దాతలు ముందుకు వచ్చి గణేష్ విద్య కొనసాగించేందుకు సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా స్థానిక డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు సౌరం చిన్నయ్య కాంగ్రెస్ నాయకులు దామెర ఆనందం సౌరం ప్రభాకర్ మాణిక్యం అభికేశం సౌరం అభిలాష్ దాసు తో పాటు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter