సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఏండ్లు గడుస్తున్నా జర్నలిస్టులకు నీడకల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శేషగిరిభవన్లో మంగళవారం జరిగిన వామపక్షాలు, విపక్ష పార్టీలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా, సామాజిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ వేదికపై జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని హీమీ గుప్పిస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయిందన్నారు. జర్నలిస్టులతో పనిలేకుండా పత్రికలు ఛానళ్ళ యాజమాన్యాలను గుప్పెట్లో పెంట్టుకుంటే సరిపోతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉండటం వల్లే వారి సమస్యల పట్ల స్పందించడం లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ను నిలదీసే దమ్ము దైర్యం లేకపోవడం వల్లే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా జర్నలిస్టులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారని, చిత్తశుద్ధితో స్థలాలు ఇవ్వాలనే ఆలోచని ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందన్నారు. కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికి మంజూరు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, జర్నలిస్టులు పేదవారు కాదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో సమిష్టిపోరాటాలే శరణ్యమని, జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వం పోరాడేందుకు వామపక్షాలు, విపక్షాలుగా సిద్ధంగా ఉన్నామని, ఉద్యమ భాద్యతను తామో మోస్తామని పునరుద్ఘాటించారు. మరోసారి సమావేశమై పోరాట కార్యాచరణను రూపొందించి ప్రత్యక్ష ఆందోలనలకు పూనుకుంటామన్నారు. సమావేశంలో సిపిఐ, ప్రజా సంఘాల జిల్లా నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, గుత్తుల సత్యనారాయణ, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, లిక్కి బాలరాజు, నూనావత్ గోవిందు, ఎస్ కె. ఫహీమ్, కె.తర్నకుమారి, గోనె మణి, బోయిన విజయ్ కుమార్, మాచర్ల శ్రీనివాస్, పి. సత్యనారాయణచారి, గొనె సురేష్, షమీమ్, విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు ఉమంది ఉదయ్ కుమార్, జి.వెంకటేశ్వర్లు సూరి, శివకుమారస్వామి, కుమార్, దశరద్, అప్పారావు, సుధాకర్రావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin