సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలకు నియమించిన కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సూర్యపేట జిల్లా మహాసభను జయప్రదం చేయాలని నూతనంగా ఏర్పాటైన కమిటీ ప్రతి గ్రామ గ్రామాన తిరిగి గ్రామ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని చలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు సిద్ధం కావాలని అధ్యక్షులు దేవపంగ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నియామక ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మాదిగల మహా పోరాటానికి మాదిగలంతా ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం మాదిగ జాతి బిడ్డల కోసం యువత కంకణం కట్టుకొని ముందుకు నడవాలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మాదిగల ఉనికిని కోల్పోతున్నామని రిజర్వేషన్ లేకుంటే మన విద్యార్థులకు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుందని అందుకే ఏ బి సి డి లుగా వర్గీకరించుకుంటే అది జాతి అభివృద్ధికి దోహపడుతుందన్నారు. మన జాతి ముద్దు బిడ్డ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేష్ మాదిగ ఉపాధ్యక్షులు నూక పొంగు రమేష్ మాదిగ, ఎం.ఎస్.పి అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాదిగ, కొమ్ము నాగరాజు మాదిగ, కార్యదర్శి పిడమర్తి బాబుమాదిగ సహాయ కార్యదర్శి కుక్కల వెంకన్నమాదిగ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin