సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : RSYF AISA ఆధ్వర్యంలో కదిరి మండల ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎమ్మార్వో ముకుంద కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.... కదిరి పట్టణంలో కొన్ని సంవత్సరాల నుండి V-TRACK మరియు ATD కంపెనీలకు లేబర్ లైసెన్స్ లేదు కనీస వేతనాలు ఇవ్వడం లేదు పిఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, దాదాపు 70 నుండి 80 మంది పని చేస్తున్నారు యువత యొక్క శ్రమను దోచుకుంటున్నారు, ప్రభుత్వ సెలవు దినాలలో కూడా సెలవు ఇవ్వకుండా ఈ కంపెనీ యాజమాన్యం వారు పని చేయిస్తున్నారు, చాలాసార్లు మీ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది, ఇప్పటికైనా స్పందించి లేబర్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని V-TRACK - ATD రెండు కంపెనీలో పైన చర్యలు తీసుకోవాలని యువతకు న్యాయం చేయాలని, RSYF AISA గా డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో RSYF రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ AISA జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ, RSYF కదిరి నియోజకవర్గ కార్యదర్శి సకినాల చరణ్, AISA కదిరి నియోజకవర్గ కార్యదర్శి ప్రదీప్, రాజేష్ ,నవీన్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin