Tuesday, 15 September 2026 12:31:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లోని రెవిన్యూ భూములను కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు

Date : 26 June 2023 12:20 AM Views : 475

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ రెవెన్యూ అధికారులకు కనువిప్పు కల్పించండి రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించటం ఏమిటి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవిన్యూ శాఖ అధికారులు తక్షణమే అక్రమ నిర్మాణాల ఆపి స్వాదీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి.. అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేస్తున్న పనులను పరిశీలిస్తున్న నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాని కి వినతి. రామస్వామి గట్టు వద్ద ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జా చేసిన పలువురు కిందిస్థాయి రెవిన్యూ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్* ప్రభుత్వ ఆస్తులను రక్షించవలసిన అధికారులే భక్షిస్తున్నారు.. హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమం ఉద్దేశించి ప్రజా ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు ఎస్కే మోహిన్, ఎస్ కే జానీ పాషా, దొంతగాని జగన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది హుజూర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు వీఆర్వో గ్రామ సేవకులు అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అట్టి స్థలాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలము అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్..హుజూర్ నగర్ ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద సర్వేనెంబర్ 540, 529,541,542 లలో ఉన్న ప్రభుత్వ స్థలమును అక్రమ పద్ధతిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ( విఆర్ఓ) గ్రామ సేవకులు ప్రభుత్వ స్థలమును కబ్జాలు చేస్తూ అక్రమ పద్ధతిలో నిర్మాణాలు చేస్తున్నారు.( ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిన రెవెన్యూ అధికారులే కొంతమంది నిబంధనల అతిక్రమించి స్థలాలను కబ్జాలు చేయటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు పట్టణంలో తలెత్తుతున్నాయి...)ప్రభుత్వ అధికారుల నుండి వీరికి ప్రభుత్వ స్థలాలు ఇవ్వవచ్చు అని ఎలాంటి జీవో ఉత్తర్వులు వీరికి ఇవ్వకపోయినా మేము రెవిన్యూ శాఖలోనే పనిచేస్తున్నాము *మమ్ములను ఏ అధికారి అడ్డుకోలేడు ఎవరు మాపై చర్యలు తీసుకోరు అనే ధీమాతో ప్రభుత్వ స్థలాలను మేము దర్జాగా కబ్జాలు చేస్తు.. పెద్ద పెద్ద ఇల్లు నిర్మాణం చేస్తున్నా రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాలు చేస్తూ వేలు వేలు సంపాదిస్తున్న వారికి ప్రభుత్వ స్థలం ఎలా కేటాయిస్తారు.ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమందిసిబ్బంది, అలాగే హుజూర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు వీఆర్వో గ్రామ సేవకులు వీరు రామస్వామి గుట్ట వద్ద ఆక్రమణ చేసిన ప్రభుత్వ స్థలాలను తక్షణమే స్వాధీనం చేసుకొని కూల్చివేసి ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డులు పెట్టాలని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పట్టణంలో అర్హులైన నిరుపేదల అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో ప్రజా ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు వేముల నాగరాజు,ఎండి.యాసిన్ బాబా,,ఎస్కే సలీం బాబా, ఎండి. రాప్ బాబా, ఎం డీ షారు .బి సైదులు తదితరు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :