సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు డిమాండ్ చేశారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ తెలంగాణ రాష్ట్ర ఆరవ మహాసభల సందర్భంగా ఆన్లైన్ బహిరంగ సభను నిర్వహించారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరం ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ ఆన్లైన్ బహిరంగ సభలో సిఐటియు జాతీయ కోశాధికారి యం సాయిబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే సింగరేణి ఉత్పత్తే లేదని సింగరేణి మనుగడకు సింగరేణి లాభాలకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కీలకమని ఎం సాయి బాబు పేర్కొన్నారు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ద్వారా వందల కోట్ల లాభాలు గడిస్తున్న సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఉద్యోగ భద్రత కల్పించడం లేదని విమర్శించారు ఒకే కుటుంబం పేరుతో సింగరేణి యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుంది తప్ప అదే కుటుంబంలోని సభ్యులుగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కోల్ ఇండియా సహా సింగరేణి వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతుందని పేర్కొన్నారు విలువైన బొగ్గు గనులను అంబానీ అధానీలకు అప్పగించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం చట్టాలన్నింటిని మార్పులు చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కార్మికులకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు తరల పెరుగుదల ప్రైవేటీకరణ విధానాల ద్వారా కార్మికులపై తీవ్రమైన ఆర్థిక భారాలు వేశారని విమర్శించారు గడిచిన పదేళ్ల కాలంలో ఒక్క గ్యాస్ బండ ధర 400 నుండి 1200 పెరిగిందని ఇదే స్థాయిలో దేశంలోని ఏ రంగంలోని కాంట్రాక్టు కార్మికులు వేతనాలు పెరగలేదని పేర్కొన్నారు సింగరేణిలో సైతం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ విద్యుత్తు నిత్యవసర సరుకుల ధరలన్నీ వందల రెట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలు మాత్రం పెంచటం లేదని విమర్శించారు కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడులను తీసుకురావడం ద్వారా కార్మికులకు ఉన్న కొద్దిపాటి హక్కులను సైతం తొలగిస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయటం ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు వేతన భద్రత పని భద్రత కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయని ప్రకృతి వనరులు దేశ అభివృద్ధికి ఉపయోగపడే సహజ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కావటం వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అవుతుందని పేర్కొన్నారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులు సమరశీల ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులకు జేబీసీసీఐ నిర్ణయాలు ప్రకారం కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల అందర్నీ పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎం సాయి బాబు డిమాండ్ చేశారు *సింగరేణికి జీవం కాంట్రాక్ట్ కార్మికులే* *మందానర్సింహారావు* సింగరేణికి జీవం కాంట్రాక్ట్ కార్మికులేనని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పేర్కొన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణి లాభాల బాటలో నడుస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల శ్రమే కారణమని పేర్కొన్నారు సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు మాదిరిగానే కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన వేతనం సమాన హక్కులు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం సింగరేణి యాజమాన్యం దగ్గర మరియు కోల్ ఇండియా జె బి సి సి ఐ చర్చల వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అంకితభావంతోటి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల అన్ని రకాల పోరాటాలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు సింగరేణి వ్యాప్తంగా కనీస వేతనాల అమలు ఉద్యోగ భద్రత కార్మిక చట్టాల అమలుకై కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియు ఎస్సీ కేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పోరాటాలలో తాము భాగస్వాములు అవుతామని మందా నరసింహారావు పేర్కొన్నారు *కాంట్రాక్ట్ కార్మికులు అంటే బానిసలు కాదు * **CITUరాష్ట్రఉపాధ్యక్షులు భూపాల్* సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు అంటే యాజమాన్యం బానిసల్లాగా చూస్తుందని పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను తీవ్రమైన యువక్షత చూపుతోందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విమర్శించారు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులే ఉండరని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు కాంట్రాక్ట్ కార్మికులకు వివిధ సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సింగరేణిలో ఇటీవల జరిగిన దశాబ్ది ఉత్సవాలలో కాంట్రాక్ట్ కార్మికులను యువక్షితాపూరితంగా యాజమాన్యం చూసిందని ఇంతటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో జరగటం రాష్ట్ర ప్రభుత్వ పాలనకే అవమానకరమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలో చేసే నిర్ణయాల ఆధారంగా రానున్న కాలంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన సమరశీల ఉద్యమాలకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు *కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం ఐక్య పోరాటం చేస్తాం* *బి.మధుSCKSరాష్ట్రప్రధానకార్యదర్శి.* సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం మరియు కోల్ ఇండియా వేతనాల అమలు కోసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు సాధన కోసం సింగరేణిలో పనిచేస్తున్న అన్ని కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలతో కలిసి సమరశీల ఐక్య పోరాటాలకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు నాయకత్వం వహిస్తుందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు పేర్కొన్నారు ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 22 అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గత సమ్మె సందర్భంగా యాజమాన్యం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికుల పట్ల యాజమాన్యం చవితి తల్లి ప్రేమను చూపుతోందని పేర్కొన్నారు సింగరేణిలో నూతన బొగ్గు గనులు కనుకొనటం దగ్గర నుంచి ఉత్పత్తి అయిన బొగ్గును ఇతర ప్రాంతాలకు రవాణా చేయటం వరకు ప్రతి విభాగంలోనూ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ కీలకంగా మారిందని పేర్కొన్నారు అంతటి కీలక పాత్ర పోషిస్తూ తమ రక్త మాంసాలను ధారబోసి సింగరేణి లాభాల బాటలో నడిపిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం లాభాలలో వాటా ఎందుకు ఇవ్వటం లేదని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు ప్రశ్నించారు కరోనా బారినపడి మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు 15 లక్షల రూపాయల పరిహారాన్ని పోరాడి సాధించిన ఘనత సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియుకే దక్కుతుందని పేర్కొన్నారు పెండింగ్ ఏరియర్స్ సాధించడంలోనూ అనేక విభాగాల కార్మికులకు స్కిల్డ్ సెమీస్కిల్డ్ వేతనాలు సాధించడంలోనూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు పోరాటాలే కారణమని పేర్కొన్నారు అటు యాజమాన్యాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అనేక సందర్భాలలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సమరశీల ఉద్యమాలకు నాయకత్వం వహించిందని మీ మధు పేర్కొన్నారు భవిష్యత్తులోనూ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత కాల్ ఇండియా వేతనాల అమలు సమాన పనికి సమాన వేతనాలు సీఎం పిఎఫ్ పాస్ పుస్తకాల సమస్యలు స్థానికంగా ఉండే అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో కాంట్రాక్ట్ కార్మికులందరూ భాగస్వాములు కావాలని బి మధు విజ్ఞప్తి చేశారు ఈ ఆన్లైన్ బహిరంగ సభలో సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే బ్రహ్మచారి ఏ జె రమేష్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకులు డి వీరన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం బ్రాంచ్ కార్యదర్శి జి శ్యామ్ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ సిఐటియు నాయకులు భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin