సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి లో అక్టోబర్ 2 న దుగ్గొండి మండల పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ముందుగా నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.గాంధీజీ చూపిన బాటలో నడిచి గ్రామాల అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహ్మదాపురం పిఎసిఎస్ చైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు,గుడి మహేశ్వరం సర్పంచ్ కూరతోట స్వప్న సురేష్, దేశాయిపల్లి సర్పంచ్ ఉత్తరేని భాగ్యలక్ష్మి రాజబాబు,డైరెక్టర్లు లోనే శ్రీనివాస్,రాజు, సీనియర్ నాయకులు శంకేష్ రాజు,దుగ్గొండి గ్రామ పార్టీ అధ్యక్షుడు గైని భాస్కర్, మడిపెల్లి చంద్రమౌళి,కొమ్మ లక్ష్మయ్య,సుమంత్,యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter