సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు పెడతామని బూర్గంపాడు తాసిల్దార్ ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు... నేటినుండి అక్రమ ఇసుక రవాణా చేసిన స్టాక్ పాయింట్లు పెట్టిన సీజ్ చేసి కేసు నమోదు చేయనున్నట్లుగా ఎమ్మార్వో పేర్కొన్నారు. అనధికారికంగా ఉన్నటువంటి అక్రమ ఇసుక ర్యాంపులను త్వరలోనే అరికడతామని తగిన చర్యలు తీసుకుంటామని ఇసుక రవాణా చేసే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలతో పాటు అధిక మొత్తంలో ఫైన్ కూడా విధించనున్నట్లు పేర్కొన్నారు.. సామాన్యులకు అందుబాటులో ఇసుకను అందించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టుగా పేర్కొన్నారు...
-----------------------
Admin