సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : పుస్తక పఠనంతోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతామని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ అన్నారు రామకృష్ణ సేవా సమితి వివేక జాగృతి ఆధ్వర్యంలో శనివారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్న వివేకానందుడు సైతం తనకున్న పుస్తక పటన అలవాటు వల్లనే మంచి విషయాలను మాట్లాడగలిగినట్లు ఆయన చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం పెరిగిపోవడంతో పుస్తకం ప్రాధాన్యత తగ్గిందని ఆయన అన్నారు కానీ పుస్తకంలో చదువుకున్న విషయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అదే కంప్యూటర్ తెరపై చదివిన అంశం కొద్దిసేపు మాత్రమే ఉండి తర్వాత మాయమైపోతుందని ఆయన అన్నారు ఏ విషయం తెలుసుకోవాలన్న గూగుల్ పై ఆధారపడుతున్నారని ఒకవేళ గూగుల్ లేకుంటే ఎలా ఉంటుందో ఊహించండని ఆయన అన్నారు రామకృష్ణ సేవా సమితి మంచి ఆలోచనతో విలువైన పుస్తకబండాగారాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలను మనమందరం ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిజెపి నాయకులు మయూర్ చంద్ర ఆదినాథ్ ముకుంద సేవాసమితి నాయకులు లెలిన్ తదితరులు ఉన్నారు...
-----------------------
Admin