సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం పాల కిడు మండల కేంద్రము లో గౌడ మరియు రజక సోదరుల కోరిక మేరకు పాల కీడు మండల కేంద్రంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. రఘు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రకెక్కిన వీరుడి గురించి.. చరిత్రకారులు చెప్పని యోధుడు తెల్లోడిమీద తిరుగుబాటు చేసి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్రలో స్థానం దక్కడం సంతోషించదగిన విషయం. కానీ తెల్లోడు మన దేశంపై కన్నేయడం కంటే ముందే సామ్రాజ్యవాద కాంక్షతో దేశాన్ని.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడిగాథ గురించి ఎంతమందికి తెలుసు అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. అందుకు కారణం చరిత్రలోని కీలక ఘట్టాలను రాసిన చరిత్రకారులు ఆ యోధుడిని మాత్రం కావాలనే విస్మరించారనే వాదన ఉంది. ఆ వీరుడు ఇంకెవరో కాదు.. బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాదు.. పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రఘు చెప్పాడు అనంతరం ఐలమ్మ గురించి మాట్లాడి చిట్యాల( చాకలి )ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ గారి విగ్రహాలను రఘు అన్న పాలకీడు మండల కేంద్రంకి అందించడం తో పాటు జనసంధ్రోహం మధ్య హుజూర్ నగర్ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే పిల్లుట్ల రఘు విగ్రహాలను ప్రారంభించారు. రఘు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉందని గౌడ మరియు రజక కులస్తులందరూ కలిసి ఒకటిగా వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ చేయడం మరియు విగ్రహాల ఏర్పాటు కు దిమ్మ కట్టడానికి సహకరించిన పాల కీడు సర్పంచ్ బైరెడ్డి జితేందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్య వాదములు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కి హాజరు ఐనటువంటి రాపోలు నవీన్ కి మరియు కమిటి సభ్యులకు ప్రతేక శుభాకాంక్షలు . పాల కీడు మండలానికి ఎలాంటి సహకారం ఐనా చెయ్యడానికి నేను సిద్ధం అని దేవాలయం కి నా వంతు సహకారం ఉంటాధని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అని ఈ కార్య క్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులు కుక్కల వెంకన్న, శివా రెడ్డి గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి ప్రతేక ధన్య వాదములు తెలిపారు.
-----------------------
Admin