సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తనకల్లు మండలం, కోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన జగనన్న కానుక బై జ్యూస్ లోడెడ్ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబ్ లను అందజేశారు. విద్యార్థులు గౌరవ ముఖ్యమంత్రి పైన ఉన్న మక్కువతో, గౌరవంతో థాంక్యూ సీఎం మామయ్య అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ నిరంతరం విద్యా విధానంలో మార్పులు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలో గల సౌలభ్యాన్ని ప్రభుత్వ పాఠశాలలోనే కల్పించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివే విధంగా చర్యలు చేపట్టారన్నారు. నేడు మరొక అడుగు ముందుకేసి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జగనన్న కానుకగా రూ.688 కోట్ల రూపాయలతో బై జ్యూస్ ఫ్రీ లోడెడ్ ట్యాబ్ లను అందచేయడం జరుగుతున్నది, ఈ ట్యాబ్ ల ద్వారా విద్యార్థులు సబ్జెక్టు పైన మంచి అవగాహన ఉంది కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా త్రీడి, యానిమేషన్ చిత్రాల రూపంలో విద్యార్థులకు బోధించబడుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి సబ్జెక్ట్ నందు మంచి అవగాహన కలిగి జగన్మోహన్ రెడ్డి ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ సంకల్పాన్ని సహకారం చేసే విధంగా కృషి చేయాలన్నారు. విద్యా విధానంలో మంచి నైపుణ్యాలతో, నేర్పుతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, జగన్ మామయ్య కల నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లలితమ్మ, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఎస్ఎండి ఇస్మాయిల్, కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, ఎంపీడీవో నరసింహులు, వైస్ ఎంపీపీలు శ్రీనివాసులు, ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు రామచంద్రారెడ్డి, ముణేనాయక్, నాగేంద్రబాబు, ఎంపీటీసీలు వెంకటసుబ్బమ్మ హేమ శేఖర్ రెడ్డి, ఈశ్వరప్ప, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రామ్ దేశాయ్, మార్కెట్ డైరెక్టర్ పూల శీన, టెంపుల్ డైరెక్టర్ రమేష్ నాయక్, ఉమామహేశ్వర్ రెడ్డి, కొండ మల్లికార్జున, చంద్రమౌళి, అమూల్యనాథ్ రెడ్డి, చిదానంద రెడ్డి, శ్రీకంఠ రెడ్డి, ఇటుకుల వెంకట రమణ, రామ్మోహన్ రెడ్డి, సిద్ధారెడ్డి, నీలకంఠ రెడ్డి, బాబా ఫక్రుద్దీన్, మహేష్ రెడ్డి, తాహిర్, రహంతుల్లా రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, బాబు, శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మి నారాయణ రెడ్డి, తిమ్మయ్య, చంద్రప్ప, అశోక్ రెడ్డి, వెంకటేష్, పవన్ కుమార్ గౌడ్, శివకుమార్, శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్, రాజా రెడ్డి, దాడెప్ప, సోషల్ మీడియా సోదరులు, పాఠశాల చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin