సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు బుధవారం వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు.ఆలయానికి విచ్చేసిన మంత్రి గారికి ఆలయ ప్రధాన అర్చకులు శేషు గారి ఆధ్వర్యంలో ఈవో, వేద పండితులు, అధికారులు, మరియు ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో,మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. స్వాగత మర్యాదల అనంతరం మంత్రి గారు గర్భాలయంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని వేడుకున్నారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కొండా సురేఖ గారికి వేదాశీర్వచనం అందజేశారు.ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను మంత్రి గారికి బహూకరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
-----------------------
Reporter