సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి విష్ణు వారియర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా లో 52% సైబర్ క్రైమ్ పెరిగింది కానీ సైబర్ నేరాలు ద్వారా మోసపోయిన రికవరీనీ రాష్ట్రంలోనే ఎక్కువ చేశాం . ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం . రాష్ట్ర లో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో పాస్ పోర్ట్ ఎంక్వయిరీ రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నాం . ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ లు 50% తగ్గాయి .రాబోయే సంవత్సరంలో స్పీడ్ బోర్డింగ్లు ఏర్పాటు చేయబోతున్నాం . జిల్లాలో ఈ సంవత్సరం 27 చైన్ స్నాకింగ్ కేసులో నమోదు కాదు 24 చేదించడం జరిగింది . ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 38 శాతం తగ్గటం జరిగింది . సైబర్ నేస్తం అనే నెంబర్ నుండి జిల్లా లో 15 గ్రూపుల్లో యాడ్ చేయడం జరిగింది . దీని ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తుంది . ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన గంజాయి 8 వేల కిలోల గంజయిని కాల్చివేయటం జరిగింది . ఈ సంవత్సరం చైల్డ్ లేబర్స్ సంఖ్య జిల్లా వ్యాప్తంగా తగ్గింది . జిల్లా వ్యాప్తంగా దొంగతనాల సంఖ్య పెరుగుతున్నాయి . అదేవిధంగా రికవరీ కూడా జరుగుతుంది అని తెలిపారు .
-----------------------
Admin