సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐ.టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన టిఆర్ఎస్ కార్యకర్తల ఇంట్లో పెద్ద పండగ లాంటిదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. తమ అభిమాన నాయకుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. షాద్ నగర్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో, వాడల్లో, గల్లీలో పెద్ద ఎత్తున రామన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు కేక్ కటింగ్ లు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలు పండ్లు అందజేశారు. ఉదయం నాగులపల్లి గ్రామంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం షాద్ నగర్ లో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్, మొక్కలు నాటడం జరిగింది. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లకు బ్రెడ్, పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. హారిత హరం కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ పట్టణంలో పలు చోట్ల మొక్కలు నాటడం జరిగింది. షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. రామన్న జన్మదిన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్, పట్టణ కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
-----------------------
Admin