సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూర్యాపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కొమర్రాజు వెంకట్ మాట్లాడుతూ ఒకే నెలలో విద్యార్థినీల ఆత్మహత్యలకు గల కారణాలను విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి వారం రోజులో నివేదిక వెల్లడించాలని లేనియెడల జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముత్తడి చేస్తామని, విద్యార్థినిల ఆత్మహత్యలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థినీలు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనిపై విద్యాశాఖ మంత్రి గారు దృష్టి సారించి విద్యార్థులకు ప్రత్యేకమైన మానసిక తరగతులు నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పలుబడ్డ విద్యార్థులకు 25 లక్షల రూపాయలు ఎక్స్కేసియా ప్రకటించాలని ప్రతి ఒక్క విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, స్కూలు కాలేజీల వద్ద పోకిరిల బెడద తగ్గించాలని దానిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సాధించి ప్రతిరోజు పెట్రోలింగ్ చేయాలని , డ్రగ్స్ కు గంజాయికి అలవాటుపడ్డ యువత పై ప్రత్యేక దృష్టి సారించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు...
-----------------------
Admin