సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం : మండలంలోని చేర్లోతండ, యర్రగొండపాలెం గ్రామాలలోని గ్రామ రైతు సేవ కేంద్రలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ముందుగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతులతో కలిసి సాగు చేస్తున్న కంది,మినుము, పొగాకు పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.అనంతరం రైతు సేవ కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కె.వి శేషారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ లో పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నందు నమోదు చేయించుకోవాలని తెలిపారు.అదేవిధంగా ఖరీఫ్ లో కంది పంట వేసిన రైతులు మీ గ్రామాల్లో ఉన్న రైతు సేవ సిబ్బంది ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలన్నారు.రబీ లో సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి యల్ మాల్యాద్రి రెడ్డి,ఆ గ్రామాల వ్యవసాయ సహాయకులు మంత్రు నాయక్,ఆదిలక్ష్మి రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin