Thursday, 30 July 2026 12:26:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లు కు పోలీస్ హెచ్చరిక...

Date : 11 January 2024 05:36 AM Views : 273

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం : వాహన ప్రమాదాలను, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికా వద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక... వాహన ప్రమాదాలు నివారించడానికి రేడియం స్టిక్కర్లుతో సురక్షితం . సిఐ శ్రీనివాస్,ఎస్. ఐ షాహీన. స్పెషల్ డ్రైవ్.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు , నెంబర్ ప్లేట్ తప్పుగా ఉంటే ఇక అంతే..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో వాహనాల స్పెషల్ డ్రైవ్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ శ్రీనివాస్ అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ట్రాక్టర్లకు యజమానులకు అవగాహన కల్పించి ప్రమాదాల నివారించేందుకు ట్రాక్టర్లకు మరియు వాహనాలపై రేడియం స్టిక్కర్లు అతికించి, డ్రైవింగ్ లైసెన్స్ లు పెండింగ్ చలానాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాల డ్రైవర్లు ప్రమాద బారిన పడి కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోకుండా,ప్రమాదలు నివారించేందుకు అవగాహన కల్పించారు.. వాహనదారులందరికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనం కు ఇన్సూరెన్స్ తో పాటు ప్రతి వాహనం పై నెంబర్ ప్లేట్లు ఉండాలి , మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపిన ప్రమాద బారిన పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వాహనాలకు లైట్లు, స్టిక్కర్లు,ఇండికేటర్స్ , రహదారికి పక్కన ట్రాక్టర్,వాహనాలు రాత్రి పగలు సమయంలో రోడ్డు పక్కన ఉంచరాదని శీతాకాలం కనుక వాహనాలు ప్రమాద బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు .. ఇష్టం వచ్చిన నెంబర్ ప్లేటు పెట్టుకుని అన్నపురెడ్డి పల్లి మండలంలో తిరిగే వారిపై.. ఇక కఠిన చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. తప్పుడు నెంబర్‌ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడిపే వాళ్లు, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోనే తిరిగే వాళ్లను పట్టుకోనున్నారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ దర్జాగా తిరిగే వారిపై ఇక నుండి కఠిన చర్యలు తీసుకోనున్నట్టుగా పోలీసులు హెచ్చరించారు... మండలం లో తప్పుడు నెంబర్ ప్లేట్లను పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో రెండు వారాలుగా.. వాహనాలను ఉపయోగించి.. నేరాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నెంబర్‌ ప్లేట్స్‌ సరిగా లేని వెహికల్స్‌తో పాటు కార్లకు బ్లాక్‌ ఫిలిం అతికించిన వాటిని గుర్తించే పనిలో పడ్డారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. వీటిపైనే స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. వాహనదారులు నిబంధనలను పాటించకపోవడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ తిరిగేవారికి.. కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయని, నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వాహనాన్ని నడిపే వారితోపాటు వాహన యజమానిపై కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,ఎస్సై షాహిన , కానిస్టేబుల్ రాంబాబు ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :