సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ శాయంపేట, _రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు లు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈమేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశానుసారం మండలంలోని నేరేడుపల్లి ప్రగతి సింగారం వసంతపూర్ గంగిరేణి గూడెం సూర్య నాయక్ తండ అప్పయ్య పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష టిఆర్ఎస్ నాయకుల మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యకర్తలందరూ సమిష్టి కృషితో పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం బీజేపీ ఓటు చోరీ ఆపాలంటూ ఆయా గ్రామాలలో ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. *టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు* కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులు ఆయి ప్రగతి సింగారం గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీకి చెందిన చిలుకల శ్రీను మాదాపూర్ సతీష్ పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు వీరికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాసని చంద్ర ప్రకాష్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి చక్రపాణి రఘుపతి రెడ్డి అబ్బు ప్రకాశ్ రెడ్డి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ కొమ్ముల సదానందం జగన్ హింగే భాస్కర్ శానం కుమారస్వామి ఆకుతోట సామి రెడ్డి వైద్యుల ఆది రెడ్డి మోత్కూరు భాస్కర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు._
-----------------------
Reporter