Monday, 14 September 2026 11:43:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్న పాలకులు.... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 14 July 2023 06:54 AM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ బ్రష్టుపట్టిస్తున్నడని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాలు విద్యారంగానికి 15 శాతానికి పైగా నిధులు కేటాయిస్తుంటే రాష్ట్రంలో మాత్రం కేవలం 6 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తూ బహుజన బిడ్డలకు విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.మన ఊరు-మన బడి గురించి గొప్పలు చెప్పుకుంటూ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్నారు.రాష్ట్రస్థాయిలో విద్యకు బడ్జెట్ లో 20 శాతం కేటాయింపులు ఉండాలని కోఠారి కమిషన్ సూచిస్తే 9ఏండ్లుగా బడ్జెట్లో కేవలం 6 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తున్నారని,9ఏండ్లలో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని,పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,ప్రభుత్వ విద్యను పరిరక్షించి,ప్రైవేటు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,వంగా రవిశంకర్,జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: