సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్ ఎమ్మెల్యే & నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. మోడల్ ప్రవర్తనా నియమావళి కారణంగా 70 రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్నామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో కొనసాగుతున్న హౌసింగ్ కాలనీ నిర్మాణ పనులను కెప్టెన్ ఉత్తమ్ పరిశీలించారు. పనులన్నీ నాణ్యతతో కూడినవిగా ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలోని లెఫ్ట్ లను త్వరలో పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని త్వరలో వర్షాలు పడి నాగార్జునసాగర్ డ్యాం నిండితే రైతులకు సకాలంలో ఎడమ కాలువ ద్వారా నీటిని అందించి కృష్ణానది పై వున్నా లిఫ్టుల ద్వారా పంటలు సకాలంలో పండించుకొనుటకు రైతులకు అందుబాటులో ఉండేలాగా లిఫ్ట్ కాలువ మరమ్మతులేమైనా ఉంటే అధికారులు పరిశీలించి నివేదిక త్వరగా అందించాలని అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 1.06 లక్షలు, కోదాడ నియోజకవర్గంలో 97 వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు...
-----------------------
Admin