Wednesday, 29 July 2026 02:05:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచ To ములకలపల్లి రోడ్ పై గొంతులకు మోక్షం ఎప్పుడు...?

Date : 15 October 2022 11:29 PM Views : 675

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు రోడ్డుకు మరమ్మతు ఎప్పుడో అని ఎదురుచూస్తున్న బాటసారిలు. పాల్వంచ పట్టణ పరిధిలో... దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు చినుకు పడితే చిత్తడిగా... రోడ్లు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దారుణంగా గుంతల మయం అయిందని దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ఈ రోడ్డు నిర్దర్శనం. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యతలేని మెటీరియల్ ఉపయోగించి, నాసిరకంగా రోడ్లను నిర్మించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాణ్యత ప్రమాణాలను చూశారా..! అని సందేహం వెళ్ళబుచుతున్నారు స్థానికులు. ఈ గుంతలు, వాహనదారులకు శాపంగా మారాయా...! రాత్రి పూట గుంతలో పడి యాక్సిడెంట్లో గాయాలపాలై, ఎవరికి ఏమవుతుందో అని భయమేస్తుంది స్థానికుల ఆవేదన. పగలు రాత్రి అని తేడా లేకుండా,వాహనదారులు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి. పాల్వంచ దమ్మపేట సెంటర్ నుండి కుంటి నాగుల గూడెం వరకు రోడ్డు మరమ్మత్తులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని..... కోట్ల రూపాయల నిధులతో నాసిరకం రోడ్లను నిర్మించడానికి సహకరించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కటిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :