సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలంలోని దర్గా నగర్ క్యాంప్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గాంధీనగర్ నుండి దర్గా నగర్ క్యాంప్ వరకు బైక్ రైలుతో స్వాగతం పలికారు. దర్గా నగర్ క్యాంప్ లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కింది తండా దుర్గా నగర్ క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డిప్రచారం. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. 9 సంవత్సరాలుగా పాలిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్మూర్ నియోగవర్గ బిఆర్ఎస్ చోటామోటా నాయకులు భూకబ్జా చేస్తూన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు వాగ్దానాలను నెరవేరుస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు పై వైద్యం ఉచితంగా 10 లక్షల వరకు మహిళా కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగవచ్చని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. గృహ జ్యోతి వల్ల ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత కల్పిస్తామని, యువ వికాస్ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపిస్తామని ఆయన అన్నారు. చేయూత ద్వారా నెలవారి పింఛన్లకు 4 వేలకు రుదులకు అందరికీ ఇస్తామని తెలిపారు. 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతకుంట రవి ప్రకాష్, బ్లాక్ ప్రెసిడెంట్వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ సంఘటన గంగాధర్ గౌడ్, అధ్యక్షులు మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, సీనియర్ కాంగ్రెస్ డిసిసి డేగ పోశెట్టి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవా సింగ్, కృష్ణ మహిళలు,యువకులు పాల్గొన్నారు.
-----------------------
Admin