Monday, 14 September 2026 10:18:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సర్వేనెం.38లో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివాసీ రైతులకు పట్టాలు మంజూరు చేయాలి...

Date : 24 September 2025 10:58 PM Views : 626

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో బోదాపురం( జి) సర్వేనెం.38లో ఉన్న ప్రభుత్వ భూములు ఆదివాసీ రైతులకు పట్టాలు మంజూరు చేయాలని వెంకటాపురం మండల తహసిల్దారి గారికి బోదాపురం ఆదివాసులు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై కుటిల కుతంత్రాలు చేస్తూ ఆదివాసి జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసీల చట్టాలు నిర్వీర్యం చేస్తూ ఆదివాసులను జీవన,మరణ పోరాటంలోకి నెట్టు వేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటాపురం మండలం బోదాపురం( జి) సర్వేనెం. 38 ప్రభుత్వ భూములు లో ఆదివాసి రైతులు సాగు చేసుకుంటుంటే అట్టి భూములపై ఫారెస్ట్ అధికారులతో కలిసి దౌర్జన్యంగా దుర్మార్గంగా ప్రభుత్వ ,పోడు భూముల నుంచి ఆదివాసులను తరిమి ప్రభుత్వం కుట్రపూర్తిగా లాక్కోవాలని చూస్తుందని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు భూమి,అడవి పుట్టినప్పటి నుండి ఆదివాసులు అడవిలోనే జీవిస్తున్నారు అని బలమైన సాక్షాదారాలు ఉన్నప్పుడు ఆదివాసులు అడివిలో అక్రమ చొరబాటుదారులు కాదని హక్కుదారులని ఫారెస్ట్ అధికారులు గమనించాలని అన్నారు. బోధపురం(జి)సర్వే నెం.38 లో 115 మంది ఆదివాసి రైతులు 20 సం,ల నుండి సాగు చేసుకుంటున్నారు ఆ భూములపై ఫారెస్ట్ అధికారులు ఆదివాసి రైతులను ఫారెస్ట్ భూమి అని అడ్డగించడం సరైన విధానం కాదన్నారు. ఆదివాసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా ఆదివాసులపై దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఆదివాసులను వేధిస్తున్నారని వాపోయారు. బోదాపురం(జి)సర్వేనెం.38 ప్రభుత్వ భూములో సాగు చేసుకుంటున్న ఆదివాసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కంతి చందర్రావు, చింత సమ్మయ్య, పొడెం సత్తిబాబు, ఇర్ప శ్రీనివాసరావు, సోడి సారయ్య, పోడెం నవజీవన్ బాబు, సోడి కృష్ణ కంతి ప్రశాంత్, కట్టం సూరయ్య, కారం సురేష్, తెల్లం ఆనంద్ కుమార్, రేగ నాగేశ్వరరావు, ఆదివాసి రైతులు, మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: