సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆలిండియా ఫైనాన్షియల్ లిటరసీ 2023 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుజూర్ నగర్ వారి సౌజన్యంతో మఠంపల్లి మండల విద్యాధికారి చత్రు నాయక్ ఆధ్వర్యంలో మఠంపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. మండలంలోని ఏడు పాఠశాలల నుండి 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు .ఇట్టి క్విజ్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదవీడు ప్రథమ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మఠంపల్లి ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రఘునాధపాలెం స్థానం సాధించారు విజేతలకు పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంస పత్రాలను మండల విద్యాధికారి చత్రు నాయక్ అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ వేణుగోపాల్ ,పి శ్రీమన్నారాయణ ,రమేష్, రాధా, రామకృష్ణ ,రాజు, అశోక్ రెడ్డి , ఇన్విజిలేటర్ గా వీరస్వామి బ్యాంక్ సిబ్బంది గోపి రాము తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin