సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టి బొమ్మ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను వక్రీకరించి ప్రజలను మోసం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంచి మనసుతో రైతు బందు, రైతు బీమా ప్రభుత్వ పథకాలన్నీ ఎలక్షన్ నిర్వహించే నాటి కంటే ముందే ప్రజలకు చేరాలని ఎలక్షన్ కమిషన్ కు విన్న విస్తే ప్రభుత్వ పథకాలు ఆపాలని ఫిర్యాదు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తు నియోజకవర్గ ఎమ్మెల్యే చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలుపొందు తారని అంతేకాకుండా రైతులను మోసం చేస్తున్నారు అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు కానీ రైతులను గుండె లో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.రైతుల కి ఏక కాల రుణ మాఫీ అని ,ఉచిత విద్యుత్ అని, పంటకి గిట్టు పాటు ధర అని,కృష్ణ గోదావరి నదులపై ప్రాజెక్ట్స్ లు కట్టి రైతులకి ప్రజలకి నీళ్ళు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేప్పే మాయ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు కావున ఇలాంటి దుషు ప్రచారాలు మానుకొని మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకొని ఓట్లు దిగితే బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఏర్రగాని నాగన్న ,కోతి సంపత్ రెడ్డి, రణపంగు రాము తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin