సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : పంచాయతీలు అభివృద్ధి చెందకుండా గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ...దేశ అభవృద్ధికి పల్లెలే పట్టు కొమ్మలు అన్నా గాంధీ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టిపిసిసి, సీఎల్పీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు 15 ఫైనన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులు దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసి గ్రామపంచాయతీలను చిన్నచూపు చూస్తుందని అన్నారు. అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు, గ్రామాల సర్పంచ్ లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చట్ట ప్రకారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామంటే రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండ అప్రజాస్వామికంగా గృహనిర్బంధం చేయడం దారుణమని అన్నారు. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందాలని లక్ష్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోజ్ గార్ యోజన పేరుతో ఒక పతకం తీసుకువచ్చిందని అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తుందని అన్నారు.నేడు పాలకులు గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలను నీరుగారుస్తూ నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లడుతూ... కలసిమలో అభివృద్ధి చెందితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మించి కేసిఆర్ పంచాయతీ సర్పంచులను నట్టేట ముంచారని విమర్శించారు. పంచాయతీకి రావాల్సిన నిధులను రానీయకుండా పార్టీ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య అనుకుంటే సర్పంచులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి డబ్బులు రాక అప్పుల ఊబిలో కోరికపోయి సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. వీటన్నిటిని ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ముందుకు వస్తే అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. యావత్ తెలంగాణ సమాజం సమస్యలపై జనవరి 26 నుండి హత్ సే హాత్ జోడో పేరుతో నిరసనలు చేపట్టనున్నామని సర్పంచులందరూ బయటికి వచ్చి తమ ఘోడును ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా గర్జించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు వైరా నియోజకర్గ పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు,జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు గజ్జెల్లి వెంకన్న,నగర బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్,నగర మైనారిటి అద్యక్షులు అబ్బాస్,మద్ది వీరారెడ్డి,వసీం,ఏలూరి రవికుమార్,కిరణ్,పాలకుర్తి నాగేశ్వరరావు,అంజనీకుమార్,బచ్చలకూర నాగరాజు,రమణచౌదరి,వెంకటకృష్ణ,రియాజ్,యశ్వంత్,సాయి,అమరనేని బాబూరావు తదితర నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin