సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం నాచారం గ్రామపంచాయతీలో. గ్రామపంచాయతీ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రజానికం 80 శాతం మంది టిఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెంది పార్టీ నుంచి తప్పుకొని టిఆర్ఎస్ పార్టీకి రాం రాo అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. దమ్మపేట సింగిల్ విండో డైరెక్టర్ రాఘవరావు మరియు దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కండవులు కప్పుకొని కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి అడుగు మాత్రమే దమ్మపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అత్యధిక సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ విజయభేరి బోగించడానికి సిద్ధంగా ఉందని ప్రజలంతా ఒక్క దమపేటలోనే కాదు మిగతా మండలాల్లో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మా వెనక నడవడానికి మా పార్టీ గెలుపుకి దోహదపడుతున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin