Tuesday, 15 September 2026 12:42:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది... - బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్

Date : 24 October 2023 01:50 AM Views : 272

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, రామవరం : ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా తలంపు ఉంటే అభివృద్ధి దానంతటదే పరుగులు పెడుతుందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ అన్నారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలోని తొమ్మిదవ,పదవ,పదకొండవ వార్డులో బీఎస్పీ ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం,పాల్వంచ,సుజాతనగర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.సుజాతనగర్ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైతే కొత్తగూడెం,పాల్వంచ పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలని అన్నారు.వ్యవసాయాన్ని,పారిశ్రామిక ప్రగతిని అనుసంధానం చేస్తూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించవచ్చని,కానీ,ఆ దిశగా ఎన్నికైన ఏ ఒక్క నాయకుడు ఆలోచన చేయకపోవడం వల్లే వేల కుటుంబాలు కొత్తగూడెం నుంచి బలవంతంగా వలసలు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.అందులో రామవరం ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వలసలు జరిగాయని తెలిపారు.వలసలను నిలిపి అభివృద్ధిని ముందుండి నడిపితే వేల కుటుంబాలు ఈ ప్రాంతంలోనే జీవిస్తారని అన్నారు.ఇందుకు అనుగుణంగా బీఎస్పి పార్టీ చక్కని ప్రణాళికతో ముందుకు పోతుందని స్పష్టం చేశారు.ప్రజల కోసం,ప్రజల బాగు కోసం అనుక్షణం ఆలోచించే బీఎస్పిని ఈసారి ఎన్నికల్లో ప్రజలు దీవించాలని కోరారు.ప్రజల దీవెనతో,అచంచలమైన విశ్వాసంతో కొత్తగూడెం నియోజకవర్గ రూపురేఖలను సమూలంగా మార్చి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.ఇక్కడే పుట్టి,ఇక్కడే పెరిగి,ఇక్కడి నేలకు,ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయమని అన్నారు. ఈకార్యక్రమంలో సాయి,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,గుడివాడ రాజేందర్,భానుమతి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: