Wednesday, 16 September 2026 01:02:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజల గొంతు గా నిలుస్తాం... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 06 December 2023 03:06 AM Views : 291

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో తాను ప్రత్యక్షంగా చూశానని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. బీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా విజయం సాధించిన సిపిఐ అభ్యర్థి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం లో ఏ సమస్య ఉన్నా సరే ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను సమయంలో ప్రజలకు అండదండలుగా నిలవాల్సిన పాలకపక్షం కుర్చీ కోసం తగులాడుకోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొత్తగూడెంలోని ప్రధాన సమస్యలను సైతం పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటి అమలు విషయంలో పాలక పక్షం ఏ మాత్రం తాత్సారం చేసిన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బీఎస్పి పార్టీని, ఏనుగు గుర్తును ప్రజలు విశ్వసించడం మొదలు పెట్టారని అన్నారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఎస్పీ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని హామీ ఇచ్చారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు పోతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు, సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి చేనిగరపూ నిరంజన్ కుమార్, జెంగం జేశ్వంత్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: