సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన పేద రైతు రామయ్య నాసిన్ సంస్థ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో తన భూమి ఇవ్వనని గౌరవ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది .నాశన సంస్థ ప్రతినిధుల్లో రామయ్య కుటుంబాన్ని పోలీసులు ద్వారా నిర్బంధించి బలవంతంగా దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడుతూ చిత్రహింసలు గురి చేస్తున్నారని సంబంధిత అధికారులు గౌరవ హైకోర్టు ఉత్తర్వులు అమలు పరుస్తూ అక్రమ నిర్మాణ పనులను ఆపాలని మా కుటుంబానికి రక్షణ కల్పించాలని గౌరవ హైకోర్టును సీసీ నెంబర్ 51483/120 22 ఆశ్రయించడం జరిగింది. అయినా నా సెల్ పోలీసుల అధికారులు దౌర్జన్యంగా యధావిధిగా పనులు చేపడుతున్నారని తక్షణమే నిర్మాణ పలని రైతు రామయ్య కుటుంబం వారి అండగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించి అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. కావున తమరు జోక్యం చేసుకుని చట్టం ప్రకారం గౌరవ హైకోర్టు ఉత్తరం మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడకుండా తక్షణమే నిర్మాణ పనులు ఆపి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము . ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ , సిఐటియు జిల్లా నాయకులు రఫీ గౌస్ లాజం,బాబా, రాజగోపాల్, చాంద్ బాషా,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin