సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపుతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు:టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపుతో దేశ రాజకీయాల్లో పెనుమార్పు అని టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.శనివారం నాంపల్లి మండలం ఎస్. లింగోటంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ.....టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలి అని ఆయన కోరారు.టిఆర్ఎస్ పార్టీతోనే మన ప్రాంత అభివృద్ది సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.యావత్ భారత ప్రజానీకమే కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతోంది అని ఆయన అన్నారు.తెలంగాణ ప్రజలతో బిజెపి నాయకులు చెలగాటమాడుతున్నారు.కులమత రాజకీయాలకు తెలంగాణలో తావులేదు అని ఆయన అన్నారు.టిఆర్ఎస్ పార్టీతోనే మన ప్రాంత అభివృద్ది సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.బిజెపి చిల్లర చేష్టలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలి అని ఆయన అన్నారు.పగటి కలలు కంటున్న బిజెపి నాయకులకు మునుగోడులో పట్టపగలే చుక్కలు కనిపిస్తయ్ అని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో రైతు బంధు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,కంకణాల వెంకట్ రెడ్డి,TVN రెడ్డి,మారుపాకుల సురేష్ గౌడ్,దొంతం చంద్రశేఖర్ రెడ్డి, వెలుగురి వల్లపు రెడ్డి,రమావత్ దాస్రు నాయక్,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin