Wednesday, 29 July 2026 06:08:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టపగలే అక్రమ ఇసుక రవాణా...

Date : 24 February 2024 07:30 AM Views : 313

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల పరిధిలోని చిట్యాల పెద్ద వాగు నుంచి అనుమతుల పేరిట పరిసర గ్రామాలైనటువంటి కర్ని గ్రామంలో పట్టపగలే ఇసుక దందా యదేచ్చగా నడుస్తుంది. ట్రాక్టర్ల యజమానులు కర్ని గ్రామానికి ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా ఇసుక దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. ఒక ట్రిప్పు గాను చిట్యాల వాగు నుండి కర్ని గ్రామానికి రెండు వేయిల ఐదు వందల,నుండి మూడు వేల రూపాయల చొప్పున ఒక ట్రిప్పు కొడుతూ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. గత మూడు రోజుల నుండి స్థానిక ఎమ్మార్వో సువర్ణరాజ్ కు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మార్వో సువర్ణ రాజ్ కు ఫిర్యాదు చేయగా తనిఖీల నిమిత్తం కర్ని గ్రామానికి ఆర్ ఐ విజయ్ కుమార్ రావడంతో రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన ట్రాక్టర్ల దగ్గర కర్ని గ్రామానికి సంబంధించి ఏలాంటి అనుమతులు లేవు అని గుర్తించి, వారికీ వేరే గ్రామానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లిన గంటలోపే అదే ట్రాక్టర్లతో యజమానులు కర్ని గ్రామానికి యదేచ్చగా ఇసుక రవాణా కొనసాగించారు. అనంతరం ఎమ్మార్వో సువర్ణరాజ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా మారింది. వేసవి సమీపించడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నప్పటికీ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్లను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిట్యాల పెద్ద వాగు పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :