సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డివిజన్ బతుకమ్మ 2025: తెలంగాణ పుడమి ఒడిలో పురుడుపోసుకున్న పూలను పూజించే పండగే బతుకమ్మపండగ. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామం ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. 21వ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బతుకమ్మ పండగను ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముఖ్యంగా గునుగు , చామంతి, తంగేడు, ఎర్ర గన్నేరు, బంతి పూలను బతుకమ్మ తయారు చేయడంలో వాడతారు. బతుకమ్మ తయారు చేయడానికి గుమ్మడి ఆకులను పళ్లెంలో వేసి వాటిపై అందంగా పూలను పేరుస్తారు. చివరగా.. మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. గౌరమ్మను దేవతగా భావిస్తారు. సర్కార్ టీవీ న్యూస్ రిపోర్టర్ నర్సంపేట నియోజకవర్గం ఆర్సి ధార కుమారస్వామి 9866079950
-----------------------
Reporter