Thursday, 30 July 2026 04:27:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్...

Date : 13 June 2023 02:30 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / మహబూబ్ నగర్ జిల్లా : మహబూబ్ నగర్ / క్రీడలకు తెలంగాణ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని దేశంలోనే అత్యధిక క్రీడా ప్రాంగణాలు ఉన్న రాష్ట్రం మనది అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 16700 క్రీడా ప్రాంగణాలతో తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఆయన తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రన్ ను మంత్రి బెలూన్లు, పావురాలను ఎగురవేసి, జెండా ఊపి ప్రారంభించారు. రన్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగింది. విద్యార్థులు యువత పుర ప్రజలు పెద్ద ఎత్తున ఈ రన్ లో పాల్గొన్నారు. అంతకుముందు స్టేడియం గ్రౌండ్స్ లో మంత్రి మాట్లాడారు... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒకప్పుడు క్రీడా వసతులు ఏమాత్రం ఉండేవి కాదని... ఇప్పుడు స్టేడియం ఆవరణలో అద్భుతమైన ఇండోర్ స్టేడియం, ఏపీఎస్ కళాశాలలో మరో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ప్రధాన స్టేడియంలో హాస్టల్ వసతి కల్పించి క్రీడాకారులకు అండగా నిలుస్తామన్నారు. ఆట పాటలతో పాటు విద్యార్థులు చదువులోనూ చక్కగా రాణించాలని సూచించారు. చదువుకుంటూనే భవిష్యత్తు ఉంటుందన్నారు. బాగా కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయి సొంత ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇంటర్ నుంచి ఓ ఐదేళ్ల పాటు కష్టపడితే చాలు జీవితంలో స్థిర పడాతారని అన్నారు. ఇప్పుడు కష్టపడి చదవకపోతే భవిష్యత్తులో ఏదో చిన్నాచితక పని చేసి బతకాల్సి వస్తుందన్నారు. సెల్ ఫోన్ ను టైం పాస్ కోసం కాకుండా జ్ఞానాన్ని పెంచుకునేందుకు, అనుమానాల నివృత్తి కోసం మాత్రమే వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ఇందుకు హన్వాడ స్కూల్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఒకప్పుడు పాడుబడిపోయిన హన్వాడ స్కూల్ చూసేందుకు ఢిల్లీ నుంచి ఓ బృందం వస్తున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి నాయక్, డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్, ఎస్పీ కె నరసింహ, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేష్, మధు, సిఐలు రాజేశ్వర్ గౌడ్, స్వామి, ప్రవీణ్, జిల్లా మరియు యువజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, బిగ్ బాస్ ఫేం విశ్వ, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :