సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు.పశు సంపద అభివృద్ధి తోపాటు గొర్రెల పెంపకదారుల జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపుతు స్వయం ఉపాధి కల్పన ప్రభుత్వం లక్ష్యం అని సీఎం కెసీఆర్ నాయకత్వంలో మార్గదర్శకంలో గొల్ల కురుమల ఆర్దికాభివృద్దికి గొర్రెల పంపిణి పథకం అని ఆయన తెలిపారు.
-----------------------
Admin