Tuesday, 15 September 2026 10:00:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా కేంద్రంలో డబుల్ "డ్రా"మాలు...! తొమ్మిదేలుగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం...!

Date : 24 July 2023 01:20 AM Views : 493

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెంలో నిర్మాణానికి తలపెట్టిన సుమారు 830 డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాతకొత్తగూడెంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ నాయకులు 9 సంవత్సరాల క్రితం అట్టహాసంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు శంకుస్థాపనలు చేసి హడావిడి చేసి,సుమారు 830 ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి హంగూ,ఆర్భాటం చేసిన అధికార పార్టీ 9సంవత్సరాలు కావస్తున్న 100 ఇళ్ల నిర్మాణం కూడా చేపట్ట లేకపోయిందని ఆరోపించారు.అసలు ఇళ్ల నిర్మాణమే పూర్తికాని వాటికి డ్రా సిస్టం పేరుతో నాటకాలు ఆడి పేద ప్రజల నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు లక్షల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు.కేవలం ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఒకే ఒక కారణంతో పేదలకు ఇళ్ళు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వనమా కలరింగ్ ఇచ్చారని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ప్రతిపాధిత ప్రాంతంలో పూర్తిస్థాయి ఇల్లు నిర్మాణం జరగడానికి సుమారు సంవత్సరంన్నర సమయం పడుతుందని జోస్యం చెప్పారు.ఇళ్ల నిర్మాణమే పూర్తిగాని వాటికి డ్రా ఎందుకు తీశారో ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.ఈ డ్రా సిస్టం లో సైతం పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని 30 వేలు నుంచి మొదలుకొని లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.మేదరబస్తీలోని రైల్వే నిర్వాసితులకు రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని వాగ్దానం చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.పారదర్శకంగా పేదలకు అందాల్సిన డబల్ బెడ్రూం ఇళ్ళు కూడా అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,గుడివాడ రాజేందర్,జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: