Wednesday, 29 July 2026 11:12:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యువ న్యాయవాదులకు హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలి... - తాళ్లూరి దిలీప్ చౌదరి

Date : 11 June 2025 12:34 PM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : రాష్ట్రంలో 2019 తర్వాత ఎన్రోల్మెంట్‌ అయిన యువ న్యాయవాదులకు ఇప్పటికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కార్డులు జారీ కాకపోవడం ఆందోళనకర అంశమని ఫెడరేషన్‌ ఆఫ్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ జాతీయ అధ్యక్షుడు తాళ్లూరి దిలీప్ చౌదరి అన్నారు. సెక్రటేరియట్ లో న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతికి ఆయన మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 తర్వాత న్యాయవాదులుగా చేరిన వారు గత ఏడు సంవత్సరాలుగా హెల్త్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే వారికి కార్డులు జారీ చేయాలని కోరారు. ఢిల్లీ ప్రభుత్వం ఆద్వర్యంలో నడుస్తున్న "అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ స్కీమ్‌" మాదిరిగా తెలంగాణలో కూడా మెడిక్లెయిమ్ మరియు టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మోడల్‌లో 5 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్‌తోపాటు, న్యాయవాది మృతిచెందిన సందర్భంలో వారి నామినీకి 10 లక్షల రూపాయల టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తున్నారని తెలిపారు. హెల్త్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ TPA సర్వీసెస్‌ సంస్థను సంప్రదించి తెలంగాణ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ కూడా ఇలాంటి పథకాన్ని స్వీకరించాలని సూచించారు. అనంతరం హోం సెక్రటరీతోనూ భేటీ అయిన దిలీప్, 35 BNSS నోటీసు కి సవరణలు, 7 సంవత్సరాలనుండి 3 సంవత్సరాల లోపు నేరాలకు కుదించాలని, 3 నుంచి 7 ఏళ్ల non bailable కేసెస్ కి 35(3) రిమాండ్ తప్పని సరి చెసి బాధితులకి న్యాయం చేసే విధం గా సవరించాలని కోరారు. 197వ న్యాయ సంఘం నివేదిక ప్రకారం 50% టెన్యూర్ పీపీ పోస్ట్స్ కి నియామకాల్లో మార్పులు చేపట్టాలని కోరారు. న్యాయ శాఖ కార్యదర్శి ఈ వినతిపత్రాన్ని సానుకూలంగా స్పందించారని దిలీప్ చౌదరి ప్రకటనలో తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :