Wednesday, 29 July 2026 04:40:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ ఉద్యోగులు వ‌ర‌ద బాధితుల‌కు ఒక రోజు వేత‌నం విరాళంగా 100 కోట్ల...

Date : 03 September 2024 12:54 PM Views : 380

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి, ఖమ్మం నగరం దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగులు స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారని ఆయన గుర్తు చేశారు. ప్రకృతి విప‌త్తు కారణంగా భారీ న‌ష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్న లచ్చిరెడ్డి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఇది అతిపెద్ద విప‌త్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ భావించిందన్నారు జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి. ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌గా నిల‌వాల‌ని భావించామ‌న్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి త‌మ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. వ‌ర‌ద బాధితులకు అండగా నిలుస్తామన్నారు.తెలంగాణ‌లోని అన్ని ప్రభుత్వ విభాగాల‌లోని ఉద్యోగుల త‌రఫున స‌మిష్టి నిర్ణయం తీసుకున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వ‌ర‌ద విప‌త్తు సృష్టించిన ప్రాంతాల‌లో ప్రత్యక్షంగా స‌హాయ‌క చ‌ర్యల్లో పాల్గొన‌డంతో పాటు త‌మ బాధ్యత‌గా ఒక రోజు వేత‌నాన్ని విరాళంగా అందచేయ‌నున్నట్టుగా చెప్పారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :