సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బిఆర్ఎస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మొద్దని ఎన్నికల వేళ ప్రజలను మాయ చేసేందుకె కొత్త పథకాలను ప్రకటిస్తున్నారని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావు, ఆళ్ల మురళి, తూము చౌదరి అన్నారు. శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మండలం, లక్ష్మిదేవిపల్లి గ్రామపంచాయతీలో రాష్ట్ర నాయకులు తూము చౌదరి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయాస్తాలు, యూత్ డిక్లరేషన్ హామీలను కరపత్రాల ద్వారా గడపగడపకు వెళ్లి వివరిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వంట గ్యాస్ రూ.500 కే అందిస్తోందని, పెన్షన్స్ 4వేలు, నిరుద్యోగ భృతి 4వేలు, ఆరోగ్య శ్రీ రూ.5 లక్షలకు పెంచి, పేదలకు ఇల్లు నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకం, స్థలం లేనివారికి ప్రభుత్వ భూములు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, లక్ష్మీదేవిపల్లి ఉపసర్పంచ్ చింత నాగమణి, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీనివాస్, తాండ్ర నాగబాబు, ఉప సర్పంచ్ తాటి బాలకృష్ణ, వార్డు సభ్యులు తాటి విజయ్, దినేష్, నాగలక్ష్మి, పాపమ్మ , ఉప్పల హేమంత్, డి సరిత, కవిత, మాధవి, చింత రమేష్, మైనారిటీ నాయకులు ఆయుబ్ ఖాన్, లక్ష్మీదేవి పల్లి మండల ఓబీసీ అధ్యక్షులు వీరబాబు ,లక్కినేని సాయి, చిమట నాగేశ్వరరావు, సతీష్, ఉదయ్ కుమార్, ఖలీల్, క్రిస్టోఫర్, బిసి నాయకులు దేవరగట్ల ప్రసాద్, జక్కపల్లి ప్రసాద్, బ్యాండ్ వెంకట్, పీఎస్ రెడ్డి, దుర్గరాశి సతీష్, సూరిబాబు, కృష్ణ, వెంకటేష్, లక్ష్మీదేవిపల్లి గ్రామ ఆదివాసీలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
-----------------------
Admin