సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రిటర్నింగ్ అధికారి, కార్యలయం, హుజూర్ నగర్ నందు హుజూర్ నగర్ అస్సెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశెయాలకులు శ్రీ ప్రమోద్ కుమార్, ఐ.ఆర్.ఎస్. పోటీ చేసిన అభ్యర్ధుల వ్యయ ఖర్చులకు సంబందించి తనిఖీ చేసిన్నారు.అంధులో బాగంగా చేసిన అభ్యర్ధుల వ్యయ ఖర్చులకు సంబందించి వారు చేసినటువంటి అన్నీ విధముల ఖర్చులను అభ్యర్ధుల ఖర్చు రిజిస్టెర్ నందు విధిగా నమోధు చేయవలసినధిగా సూచన చేశారు. అలాగే క్రిమినల్ కేసులు వున్న వారు పత్రికలలో, టి.వి.లలో మూడు సార్లు తమ కేసుల గురించి తప్పనిసరిగా ప్రచురించి ఆ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని కోరారు.తదుపరి స్థానిక సి.పి.ఎం. పార్టీ కార్యాలయం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లను తనిఖి చేశారు. ఇట్టి కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి, ఎన్. జగదీశ్వర్ రెడ్డి, బి. క్రిష్ణ, అసిస్టెంట్ ఎక్స్పెండీచెర్ ఆబ్సెర్వెర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు అబ్జర్వర్ సమక్షంలోరెండవ రాండమైజేషన్ జరిగింది ప్రక్రియలో భాగంగా ఏ పోలింగ్ స్టేషన్కు ఏ ఓటింగ్ మిషన్( ఈ వీ ఎం)వెళుతుంది అనేది తెలియజేయడం ఈ రాండమజేషన్ ప్రక్రియలో ఉంటుంది.పోటీ చేస్తున్న అభ్యర్థులు రాండమైజేషన్ ప్రక్రియ గురించి అడిగిన సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఏ కౌశిగన్ మరియు హుజూర్ నగర్ తాసిల్దార్ నాగార్జున రెడ్డి కలెక్టరేట్ హెచ్ హెచ్ పీ రఘు పాల్గొన్నారు.
-----------------------
Admin