Saturday, 18 April 2026 08:17:15 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

Date : 05 October 2025 09:53 PM Views : 134

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ (డి కుమార్ రిపోర్టర్)@ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న లను మధ్య దళారులు వ్యాపారులు మద్దతు ధర కన్న క్వింటాకు 500 రూపాయల తక్కువ ధర కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు), ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చిన రైతుల ఇబ్బందులను ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెరు సౌకర్యం కల్పించకుండా దళారులకు వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నదని ఈ క్రమంలో కనీస మద్దతు ధర క్వింటా 2400 రూపాయలకు అమ్మాల్సిన మొక్కజొన్నలు 1600 నుంచి 2100 దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోనే మొదట దిగుబడి వచ్చే వరంగల్ జిల్లాలో ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పండిన మొక్కజొన్నలకైనా కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత పాలకులపై లేదా అని ప్రశ్నించారు. అలాగే మార్కెట్లో మొక్కజొన్నలు ఆరబోసుకొని వారాలు గడుస్తున్న కుంటి సాకులతో ధర తగ్గించడానికి కొనుగోలు జరగకపోవడం అన్యాయం అన్నారు. కనీసం మొక్కజొన్నలు డ్రై ని తగ్గించడానికి ఉపయోగించే డ్రైనర్స్ తెప్పించకపోవడం ఎంతవరకు సమంజసం అన్నాడు. ఇప్పటికైనా తక్షణమే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కనీస మద్దతు ధర అమలు అయ్యే విధంగా మార్క్ఫెడ్ నాఫెడ్ లను రంగంలోకి దించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతుల మొక్కజొన్నలకు రైతులకు తగిన విధమైన రక్షణ కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. లేకపోతే రైతుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం కలకోట్ల యాదగిరి రాజేందర్ వీరన్న సురేష్ తదితరులతో పాటు రైతులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :