సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం లో ఉన్న పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు.అంతకు పూర్వమే హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు ఎంపీటీసీ బ్రహ్మారెడ్డి ఒక ఎన్ జి ఓ ఏ ద్వారా సుమారు 25 లక్షల రూపాయల నిధులు సేకరించి కె జి బి వి పాఠశాలను అదునీకరించారు.ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం లో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్ని గురుకుల లను కూడా కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేస్తున్నారని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో 11 గురుకులలు ఉన్నాయని తెలియజేస్తూ పాఠశాలలను మన ఊరు-మన బడి పధకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని...విద్యకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా. ఎక్కడ వీలు అయితే అక్కడినుండి నిధులు తెచ్చి పాఠశాలలను ఆ భివృద్ధి చేస్తున్నామని ఈ కోవలోకే నేడు మఠంపల్లి కస్తూరి భా పాఠశాల ను కూడా ఆ భివృద్ది చేస్తున్నట్లు తెలియజేశారు. డైలీ మెనూ మరియు విద్య బోధన .టీచర్ల హాజరు తదితర విషయాలను కూడా ఎప్పటికి అప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలియజేసారు.ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,అధికారులు,పాఠశాల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin