సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పడమర ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు, సెంటర్ అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల ఆధ్వర్యంలో సిఐటియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019 సంవత్సరం నుండి అంగన్వాడీలకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కూరగాయల బిల్లులు, సెంటర్ అద్దెలు చెల్లించాలని విన్నవించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెంటర్లకు అందించే పాలు కోడిగుడ్లు, బియ్యం సక్రమంగా ఇవ్వడం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నిషా, ప్రాజెక్ట్ నాయకురాలు రంగమ్మ, సువర్ణ, రామలక్ష్మి, సుజాత, లక్ష్మి దేవి సిఐటియు నాయకులు జగన్మోహన్, ముస్తాక్, ఫైరోజ్ నిర్వహించారు...
-----------------------
Admin